Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధన్ రాజ్ ను నిజంగానే కొట్టేశాను: హీరోయిన్ సమంత

  • ఒక పట్టాన సంతృప్తి చెందను 
  • పర్ఫెక్షన్ కోసం ఆరాట పడతాను
  • పాత్రలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాను    
సమంత తాజా చిత్రంగా రూపొందిన 'ఓ బేబీ' సినిమా, వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పై ఆమె దృష్టిపెట్టారు. 'ఈ సినిమాలో ఒక షాట్ కోసం ధన్ రాజ్ ను నిజంగానే కొట్టారట గదా?' ట్రైలర్లో ఆ విషయం తెలిసిపోతోంది అనే ప్రశ్న సమంతకి ఎదురైంది.

అందుకామె నవ్వుతూ .. "పాపం .. ఆయన .. పాత్రలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను .. అందువలన అలా నిజంగానే కొట్టేశాను" అన్నారు. ఇక అవుట్ పుట్ గురించి మాట్లాడుతూ .. "ఒక పట్టాన నేను సంతృప్తి చెందను .. సంతోష పడిపోను. టీజర్ బాగా వచ్చిందంటే .. ట్రైలర్ ఇంకా బాగా రావాలని చెబుతాను. ట్రైలర్ బాగా వచ్చిందంటే .. ఆ తరువాత ఇచ్చేది మరింత బెటర్ గా వుండాలని చెబుతాను. నేను చేసింది డైరెక్టర్ ఓకే అన్నప్పటికీ, పర్ఫెక్షన్ కోసం మళ్లీ ఒక టేక్ చేద్దామని అంటాను" అని చెప్పుకొచ్చారు. 
samanta
lakshmi

More Telugu News